
Words are Weapons.
Join Panels for real talk.
Download PODIEM today.
India's People Media app.


గాజా హృదయ ఘోష ప్రపంచ ప్రజల ఘోషగా ఎప్పుటి నుండో వుందే! అది ప్రజలు మరిచిపోయే సంగతి కాదు. అయినా, మానని గాయానికి మన మనస్సులు అలవాటై మన గుండెలు క్రమంగా బండబారిపోయే స్థితి వుంది. తాజా కాల్పుల విరమణ ఒప్పందం ఆశ చిగురింపజేస్తున్నది.
ఆహారం, మందుల కొరత ప్రస్తుతం గాజాను పీడిస్తున్న అత్యవసర సంక్షోభం. ఇజ్రాయల్ సర్కార్ ఎయిడ్ ట్రక్కుల్ని అనుమతించడం లేదు. అది క్రింది ద్విముఖ ఎత్తుగడన్ని చేపట్టింది.
1-ఇరవై లక్షల మంది గాజా ఆకలి అన్నార్తులు ఒకేసారి సామూహిక మరణానికి గురికారాదు.
2-సాధారణ మనుగడ సాగించడానికి వారికి అవకాశం ఇవ్వరాదు.
పై వ్యూహంలో భాగంగా చాలా పరిమిత ట్రక్కుల్ని అనుమతించి పిడికెడు తిండి చొప్పున అందించే పనిని నెతన్యాహూ సర్కార్ చేపడుతోంది.
గాజా మరణదిబ్బగా మార్చాలనే నెతన్యాహూ సర్కార్ లక్ష్యం మారదు. అదే సమయంలో జాతి నిర్మూలన లక్ష్యం ఒకేసారి కాకుండా నియమబద్ద, క్రమబద్ద పద్దతి ప్రకారం అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నది. ఈ వంతుల వారీగా చంపే వ్యూహంలో భాగంగా అన్నార్తులకు రోజుకొక్క ముద్దవిసిరి "అన్నదాత", విధిని నిర్వహిస్తున్నది.
ఒక ఆహార పొట్లం కోసం గంటల తరబడి క్యూలల్లో బారుతీరి తొక్కిసలాటకి గురయ్యే వారి దురవస్థ ఓ విషాధ చరిత్ర!
వారి తొక్కిసలాటను ఆసరా చేసుకొని వారి పై నెతన్యాహూ ప్రభుత్వం కాల్పులు సాగించడం మరో విషాధ చరిత్ర!
నెతన్యాహూ సర్కార్ ఒక చేతితో లోక్వాలిటీ ఫుడ్ ప్యాకెట్ ని, మరో చేతితో హైక్వాలిటీ బుల్లెట్ ని ఏకకాలంలో ఉదాత్తంగా దానం చేస్తున్నది.
ఈ పోలీస్ కాల్పుల్లో UNHRO లెక్కల ప్రకారం 7-5-2025 నుండి 503 మంది అన్నార్తులు మరణించారు. మూడు వేల మందికి పైగా గాయపడ్డారు. ఇది అక్కడి దుస్థితికి అద్దం పడుతున్నది.
నిన్న ఇరాన్-ఇజ్రాయల్ మధ్య కాల్పుల విరమణ ...read more